Vijay Deverakonda : నటుడు విజయ్ దేవరకొండ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఈ మధ్యన పీఎం మోదీతో కలిసి డిబేట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు కూల్ గా సమాధానాలు ఇచ్చాడు. అందరి మన్ననలు పొందాడు. మీ సక్సెస్ కు కారణం ఎవరు అన్న ప్రశ్నకు తరుణ్ భాస్కర్, వంగా సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ లు అని చెప్పాడు . ఆ ముగ్గురు లేక పోతే తాను లేనని చెప్పాడు. ఎందుకంటే వారే తనను హీరోగా తయారయ్యేలా చేశారని కొనియాడారు.
Vijay Deverakonda Comments
ఇవాళ ఈ ముగ్గురు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారని, వారితో తాను ఎల్లప్పుడూ ఒకేలా వ్యవహరిస్తూ ఉంటానని చెప్పాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). తనకు లైఫ్ ఇచ్చిన వారిని ఎప్పుడూ మరిచి పోలేనంటూ పేర్కొన్నారు. తాను జయాపజయాల గురించి పట్టించుకోనంటూ స్పష్టం చేశాడు. తను పూరీ జగన్నాథ్ తో కలిసి తీసిన లైగర్ లో నటించాడు. ఇందులో అనన్య పాండేతో కలిసి చేసిన ఈ మూవీ ఆశించిన మేర ఆడలేదు. అయినా ఎక్కడా స్టార్ డమ్ తగ్గలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
భాగ్యశ్రీ భోర్సేతో కలిసి రౌడీ జనార్దన్ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం కొత్త మూవీ షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. తాజాగా చిట్ చాట్ లో దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. చర్చనీయాంశంగా మారాయి. తను లక్ గురించ పట్టించుకోనంటూ స్పష్టం చేశాడు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడమే తనకు తెలిసిన విద్య అని పేర్కొన్నాడు.
Also Read : Beauty Trisha :ఎప్పటికైనా ప్రేమ గెలిచి తీరుతుంది