Vijay Deverakonda : బుల్లి తెరపై పెను సంచలనం బిగ్ బాస్ . ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తయ్యాయి. ఇక తొమ్మిదో సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం పాపులర్ కార్యక్రమంగా కొనసాగుతోంది. స్టార్ మా దీనిని నిర్వహిస్తూ వస్తోంది.
Hero Vijay Deverakonda
ఏ ఛానల్ అయినా ముందుగా రేటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగానే యాడ్స్ ప్రోగ్రామ్ కు, ఛానల్ కు వస్తాయి. ఇప్పటి దాకా బిగ్ బాస్ కు భారీ ఆదరణను తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున.
తాజాగా కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొంత నెగిటివిటీ ఏర్పడడంతో మా మేనేజ్ మెంట్ బిగ్ బాస్ 9వ సీజన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు ఈసారి షోకు తనను తప్పించడం ఖాయమైందని , తనకు కాకుండా వేరే స్టార్ హీరోతో ప్రోగ్రాం హోస్ట్ చేయించేందుకు ప్లాన్ చేశారని టాక్.
ఇదిలా ఉండగా ఆహా వేదికగా ప్రముఖ నటుడు, నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఇండియాలోనే టాప్ రేటింగ్ తెచ్చుకుంది. దాని తర్వాత నాగార్జున బిగ్ బాస్ ప్రోగ్రాం ఉంది. తాజాగా ప్రోగ్రాం నిర్వాహకులు ప్రత్యేకించి పలువురు హీరోలను సంప్రదించారని కానీ వాళ్లంతా నో చెప్పడంతో చివరకు రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా దీనికి ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు.
Also Read : Kalyan Shankar Shocking :సినిమా నచ్చక పోతే డబ్బులు వాపస్