Vijay Deverakonda: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా సోమవారం హోలీ పండుగను పురస్కరించుకుని… ‘మధురము కదా..’ అనే లవ్ సాంగ్‌ను విడుదల చేసింది. అంతేకాదు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తో పాటు చిత్ర యూనిటిల్ అభిమానుల మధ్య హోలీ సెలబ్రేట్ చేసుకున్న తరువాత ఈ పాటను విడుదల చేసారు. దీనితో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి రాగా… విజయ్,మృణాల్ ల హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Vijay Deverakonda in Holi Celebrations
విజయ్, మృణాల్ మధ్య ప్రేమను తెలియజేసే విధంగా ఈ సాంగ్ ఉంది. ఈ పాటలో శ్రీమణి లిరిక్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రేయా ఘోషల్ ఈ పాటను తనదైన స్టైల్‍లో ఆలపించారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’, సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ పాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందించారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ‘తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. అందరికీ పరీక్షలు అయిపోయాయి. కాబట్టి ఈ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు కుటుంబసమేతంగా వచ్చి ఎంజాయ్ చేయండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందీ చిత్రం’ అన్నారు.
Also Read : Lokesh Kanagaraj: జూన్ లో ‘తలైవా171’ ప్రారంభం- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ !