వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ టీజర్ దుమ్ము రేపుతోంది. ఇందులో రణ బీర్ కపూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , బాబీ డియోల్ , అనిల్ కపూర్ నటించారు. మరో వైపు అర్జున్ రెడ్డి సినిమా తీశాడు వంగా సందీప్ రెడ్డి. ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు విజయ్ దేవరకొండ.
తాజాగా రష్మిక మందన్నా, రణ బీర్ కపూర్ యానిమల్ టీజర్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు విజయ్ దేవరకొండ. రష్మిక గురించి యు బి ది బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా రష్మిక తో కలిసి పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాలో నటించాడు.
ఇది బిగ్ సక్సెస్ అయ్యింది. నీ నటన సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా తన పట్ల అత్యంత ప్రేమతో స్పందించడంతో రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్ లో థ్యాంకూ రౌడీ అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
యానిమల్ మూవీని డిసెంబర్ 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీలో నటించింది..మెప్పించింది. ఆ తర్వాత వస్తున్న చిత్రం యానిమల్ కావడం విశేషం.