Vijay Deverakonda : డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. పుష్ప మూవీతో రికార్డులు బ్రేక్ చేశాడు. దేశ వ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసి తనకు తిరుగులేదని చెప్పకనే చెప్పాడు. పుష్ప 2 బిగ్ హిట్ కావడంతో సీక్వెల్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠకు తెర దించాడు. ఈ మేరకు సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు నిర్మాత పుష్ప3 కూడా ఉంటుందని తీపి కబురు చెప్పారు. దీంతో రాబోయే సీక్వెల్ మూవీ కోసం సుకుమార్ కథను సిద్దం చేశాడని కూడా తెలిపాడు.
Vijay Deverakonda in Bunny Pushpa 3 Movie
కథలు చాలా ఉన్నాయని, కానీ ఈసారి సీక్వెల్ మూవీలో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను డిఫరెంట్ రోల్ లో నటింప చేయాలని ఆలోచిస్తున్నాడని, అందుకే ఆలస్యం అవుతుందన్నాడు. దీనిపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సుకుమార్. బన్నీతో పాటు ఎవరెవరు నటిస్తున్నారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. పుష్ప 3లో నేచురల్ స్టార్ నాని లేదా రౌడీగా పేరొందిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు సుకుమార్. దీనిపై స్పందించాడు. కానీ ఎవరనే దానిపై ఇంకా అనుకోలేదని మాత్రం చెప్పాడు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది 2026లో మీ ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేస్తానంటూ స్పష్టం చేశాడు దర్శకుడు. దీంతో ఎవరై ఉంటారనే దానిపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. గౌతం తిన్నసూరి దర్శకత్వంలో కింగ్ డమ్ లో నటించాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. పుష్ప3 లో గనుక రౌడీ ఓకే అయితే మాత్రం సినిమా వేరేగా ఉంటుందని టాక్.
Also Read : Hero Pawan Kalyan Wife :పవన్ భార్య అన్నా లెజ్నెవా తలనీలాల సమర్పణ