కొందరు మాటలు చెబుతారు. మరికొందరు మనసులో ఉన్న దానిని చెప్పేస్తారు. ఆ వెంటనే దానిని అమలు చేస్తారు. అలాంటి కోవలోకి వస్తారు రౌడీగా అందరూ ముద్దుగా పిలుచుకునే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఖుషీ చిత్రంలో తనతో పాటు సమంత నటించారు. ఇది భారీ సక్సెస్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ తో తీసిన లైగర్ ఎత్తి పోయింది. బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎంతో కసితో ఖుషీలో నటించాడు.
వంద మార్కులు తెచ్చుకున్నాడు. మ్యూజికల్ గా హిట్ గా నిలిచింది. ఈ సందర్బంగా తన రెమ్యునరేషన్ నుంచి 100 కుటుంబాలకు చదువుకునేందుకు, ఇతర కష్టాలలో తోడ్పాటు అందించేందుకు గాను ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించాడు మూవీ ప్రమోషన్ సందర్బంగా.
అన్నట్టుగా నే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో వంద పేద కుటుంబాలకు లక్ష చొప్పున అందజేశాడు విజయ్ దేవరకొండ. అతడు చేసిన సాయానికి బాధితులు, పేదలు సంతోషం వ్యక్తం చేశారు. నటుడికి కృతజ్ఞతలు తెలిపారు.