Vijay Devarakonda : లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ మనసు పూర్తిగా మారిపోయిందా? ఓ అగ్ర దర్శకుడు కథలు తెస్తున్నా… నో చెప్పాడా…? స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయకూడదని రౌడీ బాయ్ డిసైడ్ అయ్యాడా? లైగర్ తో విజయ్ లో వచ్చిన మార్పు ఏంటి? యువ దర్శకులకు మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటి? విజయ్ దేవరకొండతో పనిచేయడానికి అగ్ర దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సుకుమార్, కొరటాల శివ కూడా రౌడీ బాయ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.
Vijay Devarakonda Movie Updates
కానీ విజయ్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు. అతను లైగర్ కంటే ముందు టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇప్పుడు విజయ్(Vijay Devarakonda) మరో ఆలోచనలో ఉన్నాడు. యువ దర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక గౌతమ్ తిన్ననూరి సినిమా మళ్లీ మొదలవుతుంది. ఆ తరువాత, కుర్రాళ్ళకు అవకాశమిస్తారు విజయ్. విజయ్ తెలుగు, తమిళం, కన్నడ దర్శకుల స్టోరీలు వింటున్నారు. ఈ క్రమంలో ముగ్గురు దర్శకుల కథ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ సినిమాకి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కొరా దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. అలాగే కెప్టెన్ మిల్లర్ స్టార్ అరుణ్ ముత్తేశ్వరన్ మరియు కన్నడ దర్శకుడు నార్థన్ కథ కూడా వరుసలో ఉన్నాయి. యువ దర్శకుల సినిమాలతో మార్కెట్ విస్తరించిన తర్వాత. స్టార్ డైరెక్టర్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి విజయ్ లైగర్ నుంచి మంచి పాఠం నేర్చుకున్నాడు.
Also Read : Aksha Pardasany : సినిమాటోగ్రాఫర్ ని ప్రేమించి పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ