Vijay Devarakonda : కార్తీ, రౌడీ బాయ్ కలిసి డ్యాన్స్..నెట్టింట వైరలవుతున్న వీడియో

గలాటా గోల్డెన్ స్టార్ అవార్డుల వేడుక నిన్న రాత్రి చెన్నైలో జరిగింది

Hello Telugu - Vijay Devarakonda

Vijay Devarakonda : తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ, కార్తీలది ప్రత్యేక స్థానం. తమిళులకు కార్తీ హీరో అయితే, తెలుగు వారు మాత్రం ఆయన్నే హీరోగా భావిస్తారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆ ఇద్దరు హీరోల డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారుతోంది.

Vijay Devarakonda and Karthi Dance…

గలాటా గోల్డెన్ స్టార్ అవార్డుల వేడుక నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. అవార్డు ప్రదానోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళం, ఇతర భాషల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 5న విడుదల కానున్న ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో కార్తీ అవార్డును స్వీకరిస్తున్న వేళ, వేదికపైకి కార్తీకి అవార్డును అందించడానికి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సందీప్ రెడ్డి వచ్చారు. అవార్డు అందుకున్న తర్వాత హాజరైన వారు కార్తీ, విజయ్ లను స్టెప్పులు వేయాలని కోరగా ఇద్దరు హీరోలు కార్తీ తమిళ పాటకు స్టెప్పులు వేశారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు యువ హీరోల ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీ, విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోలు స్టేజ్‌పై ఇలా డ్యాన్స్ చేస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తూ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

Also Read : Pushpa 2 Updates : బన్నీ పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com