Hero Vijay: ఉన్న కార్లు అమ్మేసి కొత్త లగ్జరీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ !

ఉన్న కార్లు అమ్మేసి కొత్త లగ్జరీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ !

Hello Telugu - Vijay

Vijay: సెలబ్రెటీలకు కారు మార్చడం పెద్ద విషయం ఏమీ కాదు. మార్కెట్ లోనికి హై ఎండ్, లగ్జరీ కారు వచ్చిందంటే చాలు… ఒకటి కొనేసి తమ ఇంటి పార్కింగ్ ను నింపేస్తుంటారు. ఈ కోవలోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త లగ్జరీ కారును కొన్నారు. అయితే ఇప్పటికే పలు లగ్జరీ కార్లను కొన్న విజయ్(Vijay)… వాటిలో రెండు కార్లను అమ్మేసి ఈ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది.

Vijay New Car…

కార్లు అంటే విజయ్‌ కి చాలా ఆసక్తి. అలా 2012లోనే రోల్స్ రాయిస్ కారుని విదేశాల నుంచి తెప్పించాడు. అయితే దీనికి ట్యాక్స్ కట్టకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రీసెంట్‌గా దీన్ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనితో పాటు వోల్వో కారుని కూడా అమ్మేశాడట. బదులుగా లెక్సెస్ ఎల్ ఎమ్ కారు కొన్నాడని సమాచారం.

తాజాగా విజయ్ ఇంటి నుంచి లెక్సెస్ కారు బయటకొస్తున్న వీడియోలు వైరల్ కావడంతో కొత్త కారు కొనడం నిజమని తేలిపోయింది. ఇకపోతే దీని ఖరీదు… కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త కారు కొనడం వరకు ఓకే గానీ పాత కార్లు ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఎందుకు అమ్మేశాడనేది సందేహంగా మారింది.

తమిళ హీరోల్లో విజయ్‌(Vijay) కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ఇందులో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులు ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు పూర్తి చేశారు. విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత మరో సినిమా చేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోని వెళ్ళిపోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.

Also Read : Thangalaan: రిలీజ్‌ కు ముందు చిక్కుల్లో విక్రమ్ ‘తంగలాన్’ సినిమా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com