Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘ఎల్‌ఐసీ’ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్). ‘కాతు వాక్కుల రెండు కాదల్’ తర్వాత విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమం అనంతరం ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయగా… కోలీవుడ్ దర్శకుడు, సంగీత దర్శకుడు కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితమే తాను ‘ఎల్‌ఐసీ’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నానని, ఆ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయన్నారు. అంతేకాదు ఈ టైటిల్ ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చిత్ర యూనిట్ ను హెచ్చరించారు. అయితే దీనిపై ఇంతవరకు చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) కు ఎల్ఐసీ సంస్థ నుండి చిక్కులు ఎదురయ్యాయి. దీనితో ఏడాది విరామం తరువాత విఘ్నేశ్ ప్రారంభించిన ఈ ‘ఎల్‌ఐసీ’ సినిమాకు మరోసారి చిక్కులు తప్పలేదు.
Vignesh Shivan – విఘ్నేశ్ కు ‘ఎల్ఐసీ’ సంస్థ నోటీసులు
తన సినిమాకు ‘ఎల్‌ఐసీ’ టైటిల్ ను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు విఘ్నేశ్ శివన్ కు నోటీసులు జారీ చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ సంస్థ (ఎల్‌ఐసీ). ఎల్‌ఐసీ సంస్థకు ప్రజల్లో మంచి పేరు, ప్రతిష్ట ఉందని… సినిమా కోసం ఈ టైటిల్‌ను ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు వారం రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎల్ఐసి సంస్థ. దీనితో విఘ్నేశ్ శివన్ కు ‘ఎల్‌ఐసీ’ టైటిల్ విషయంలో చిక్కులు తప్పేటట్లు కనిపించడం లేదు.
Also Read : Pooja Visweswar: రోడ్డు ప్రమాదంలో ‘సలార్’ నటి !