Vidaamuyarchi : చాలా గ్యాప్ తర్వాత తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ , అందాల తార త్రిష కృష్ణన్ కలిసి నటించిన విదాముయార్చి(Vidaamuyarchi) దుమ్ము రేపుతోంది. విడుదలై తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కురుస్తున్నాయి. కాసులు గల గల మంటున్నాయి.
Ajith Vidaamuyarchi Collections
కేవలం అయిదు రోజుల్లోనే ఈ చిత్రం విచిత్రంగా ఏకంగా రూ. 62.75 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. రాబోయే రోజుల్లో ఎలాంటి తమిళ మూవీస్ రిలీజ్ కు లేక పోవడంతో మరిన్ని వసూళ్లు చేయొచ్చని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు దర్శకుడు. తొలి రోజున రూ .26 కోట్లు వసూలు చేసింది. 4వ రోజున రూ. 13 కోట్లు సాధించింది. మొత్తం బాక్సాఫీస్ కలె క్షన్స్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో మూవీ మేకర్స్ సంతోషంగా ఉన్నారు.
మొదటి ఆదివారం ఫిబ్రవరి 9న ఈ చిత్రం తమిళంలో 45.95 శాతం ఆక్యుపెన్సీ రేట్ సాధించింది. విదాముయార్చి సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. అజిత్ తో పాటు త్రిష, అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, విజయ్ రమ్య, అరవ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Also Read : Beauty Urvashi Rautela :ఆ మాస్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్ కు గిఫ్ట్