Victory Venkatesh : దిల్ రాజు, శిరీష్ నిర్మాణ సారథ్యంలో దిల్ రాజు తీసిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి , బుల్లిరాజు అలియాస్ రేవంత్ కలిసి నటించిన ఈ మూవీ ఇంటిల్లిపాదిని నవ్వించింది. ఆనంద డోలికల్లో ఊగేలా చేసింది. ఈ మూవీ ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రూ. 330 కోట్లకు పైగా వసూలు సాధించింది. వెంకీమామ సినీ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.
Victory Venkatesh ‘Sankranthiki Vasthunnam’ Hindi Dubbing
ఈ చిత్ర విజయం దిల్ రాజుకు మరింత బలాన్ని ఇచ్చింది. సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్, బాలయ్య నటించిన డాకు మహారాజ్ . ఈ రెండింటిని తోసి రాజని సంక్రాంతికి వస్తున్నాం సూపర్ గా నిలిచింది. బాలయ్య మూవీ రూ. 130 కోట్ల వద్ద ఆగి పోయింది. ఇక దిల్ రాజు కు బిగ్ షాక్ ఇచ్చింది గేమ్ ఛేంజర్. టోటల్ లాస్. దానిని పూరించేలా చేసింది సంక్రాంతికి వస్తున్నాం.
తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. తెలుగులో బిగ్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారని, ఇందులో వెంకటేశ్ పాత్రలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా దిల్ రాజు అధికారికంగా వెల్లడించలేదు.
Also Read : Mad Square Sensational :మ్యాడ్ స్క్వేర్ టీజర్ యమ క్రేజీ