Victory Venkatesh : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల మోత మోగిసింది. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన ఈ మూవీ అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. మినిమం గ్యారెంటీ కలిగిన ఈ దర్శకుడు నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు మరోసారి.
Victory Venkatesh Sankranthiki Vasthunnam Collections
భారత దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) చిత్రం కాసులు కొల్లగొడుతోంది. సినీ వర్గాలను సైతం విస్మయ పరిచేలా చేసింది. జనవరి 14న విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచి బిగ్ రెస్పాన్స్ చూరగొంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తన కెరీర్ లో వెంకటేశ్ కు ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వెంకీ మామతో తీసిన ఎఫ్ 2 , సీక్వెల్ తో తీసిన ఎఫ్-3 చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేశాయి. ఈ తరుణంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సైతం దుమ్ము రేపుతోంది.
విడుదలైన మూడు రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇక ఓవర్సీస్ పరంగా కలెక్షన్లు సైతం విస్తు పోయేలా చేశాయి. అక్కడ కూడా వంద కోట్లను దాటేసింది. అతి తక్కువ రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. మొత్తంగా దిల్ రాజుకు సంతోషం కలిగించినప్పటికీ ఐటీ దాడులు విస్తు పోయేలా చేస్తున్నాయి.
Also Read : Beauty Rashmika : నేషనల్ క్రష్ ఏసుబాయిపై ఉత్కంఠ