Victory Venkatesh : ఇంటిల్లిపాది నవ్వుకునేలా పసందైన కామెడీ, కంటెంట్ పరంగా కథ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) చిత్రం. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్బంగా విడుదలైంది. అన్ని చోట్లా దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా సినిమా సక్సెస్ మీట్ ను భీమవరంలో నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజాదరణ లభించింది.
Victory Venkatesh SKVN Movie Updates
ఎవరూ ఊహించని రీతిలో సినిమాను ఆదరిస్తుండడంతో మూసుకు పోయిన థియేటర్లను తిరిగి తెరుస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాంను చూసేందుకు ఎగబడుతుండడం విస్తు పోయేలా చేస్తోందంటున్నారు సినీ క్రిటిక్స్.
ఓ వైపు సినిమా నిర్మాతల మీద ఐటీ శాఖ దాడులు కొనసాగించినా మరో వైపు ధైర్యంగా మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలను బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఏకంగా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు రూ. 260 కోట్లకు పైగానే వసూలు చేసిందని తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫేక్ సంఖ్యలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నాడు. ఇక విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.
Also Read : Hero Balakrishna Demand ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి