Victory Venkatesh : నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో ‘సైంధవ్’ ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. 13న విడుదల కాబోయే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను 3వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Victory Venkatesh Movie Updates
అంతేకాదు దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వెంకీ, బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపించగా… తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే యాక్షన్ కథాంశంగా పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందించగా… యస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా… ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నామంటూ వెంకటేష్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Hero Vijay: విజయ్-68కు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ టైటిల్ ఖరారు !