Victory Venkatesh : తెలుగు సినిమా పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమాను ఆద్యంతమూ వినోదాత్మకంగా తీయడంలో తనకు తనే సాటి. ఒకప్పుడు జంధ్యాల, ఇవీవీ సత్య నారాయణ కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆ తర్వాత ఆరోగ్యకరమైన నవ్వులు పూయించేలా చేస్తున్నాడు దర్శకుడు.
Victory Venkatesh’s Sankranthiki Vasthunnam…
మరోసారి విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) తో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో ఈనెల 14న సంక్రాంతికి పండుగ సందర్బంగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్బంగా విక్టరీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. మరోసారి నవ్వులు పూయించడం ఖాయమన్నారు.
తన కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 76వ సినిమా అని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, వారందరూ నవ్వకుండా ఉండలేరన్నారు. అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఈ సినిమాకు మంచి స్క్రిప్టు అందించారని ప్రశంసించారు.
తన ఫ్యాన్స్ తనను ఎలా చూడాలని అనుకుంటారో అంతకు మించి దీనిని తీసే ప్రయత్నం చేశాడన్నారు. నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. పని చేసిన వారంతా ప్రాణం పెట్టి పని చేశారని కితాబు ఇచ్చారు విక్టరీ వెంకటేశ్.
Also Read : Hero Satish Nivasam : ఆకట్టుకుంటున్న ది రైజ్ ఆఫ్ అశోక