Vicky Kaushal: తన భార్య ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో !

తన భార్య ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో !

Hello Telugu - Vicky Kaushal

Vicky Kaushal: బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్‌ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ రెండు నెలల క్రితం ఎయిర్‌ పోర్ట్‌లో కత్రినా వదులుగా ఉన్న అవుట్‌ ఫిట్‌లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీనితో తన భార్య ప్రెగ్నెన్సీ రూమర్స్ పై విక్కీ కౌశల్(Vicky Kaushal) స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన క్లారిటీ ఇచ్చారు.

Vicky Kaushal Comment

ఈ సందర్భంగా విక్కీ కౌశల్ మాట్లాడుతూ… ‘ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్‌ న్యూజ్‌ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం’ అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్‌ లో భర్త విక్కీ కౌశల్‌ తో కత్రినా కైఫ్‌ వేకేషన్‌కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి లవ్ అండ్ వార్‌ చిత్రంలో నటించనున్నారు.

Also Read : Aham Reboot: డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతున్న సుమంత్‌ ‘అహం రీబూట్‌’!

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com