Vadivasale : తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత జనాదరణ, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు వెట్రిమారన్(Vetrimaaran). సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల పట్ల ఎక్కువగా ఫోకస్ పెడతాడు. ప్రధానంగా కథకు ప్రాణం పోసే పనిలో ఉంటాడు. తనకు ముందు కథ నచ్చాలి. ఆ తర్వాత హీరో , హీరోయిన్లు ఎవరనేది పట్టించుకోడు. ఇది తన నైజం. అందుకే తనంటే ఎక్కువగా ఇష్ట పడతారు నటీనటులు.
Vadivasale Movie Updates
ప్రస్తుతం టాప్ హీరో సూర్య కీలకమైన పాత్రలో వాడివాసల్ తీస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేశాడు వెట్రిమారన్. తనకంటూ మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా ముద్ర పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు.
వెట్రి మారన్ , నదిప్పన్ నాయగన్ సూర్యల చిత్రం కొంత ఆలస్యం జరిగింది. పునః ప్రారంభం గురించి తిరిగి ప్రారంభం అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాడివాసల్ మూవీని కలైప్పులి ఎస్. థాను నిర్మిస్తున్నాడు.
దర్శకుడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని ధ్రువీకరించారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు క్రమంగా జరుగుతున్నాయని చెప్పాడు. షూటింగ్ కు సంబంధించి మే లేదా జూన్ లో ప్రారంభం అవుతుందని పేర్కొన్నాడు.
Also Read : Mad Square Movie :మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్