తెలుగు సినిమా చరిత్రలో ఓ సెన్సేషన్ మూవీ బలగం. కమెడియన్ గా గుర్తింపు పొందిన వేణు ఈ చిత్రాన్ని తీశాడు. అప్పటి దాకా వేణు కేవలం వినోదాన్ని పంచే నటుడు మాత్రమే. కానీ బతుకు ప్రయాణంలో భావోద్వేగాలు, బంధాలు ఎంత బలమైనవో ముఖ్యమో తెరపై కళ్లకు కట్టినట్లు , కంట తడి పెట్టేలా చూపించాడు.
సినిమా విడుదల అయినప్పటి నుంచి నేటి దాకా బలగం గురించి మాట్లాడని సినీ టెక్నీషియన్స్ లేరంటే నమ్మలేం. అంతలా జనాలకు కనెక్ట్ అయింది. కేవలం కమర్షియల్ సినిమాలే సినిమాలుగా భావించే ఈ తరుణంలో టెక్నాలజీని దాటుకుని అందరినీ విస్తు పోయేలా బిగ్ సక్సెస్ సాధించింది.
ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానంగా నిర్మాత దిల్ రాజును అభినందించక తప్పదు. ఇందులోని పాటలు, సంగీతం, మాటలు, నటీనటుల ప్రదర్శన , పాత్రలలో లీనమైన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టేలా చేసింది.
ఈ ఒక్క బలగంతో వేణు ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయి పోయాడు. తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు వెంకటేశ్ తో వేణు సినిమా తీయబోతున్నాడని, కథ కూడా ఓకే అయ్యిందని టాక్. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుందాం.