Vennela Kishore: బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మాతగా వెన్నెల కిశోర్(Vennela Kishore) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న వెన్నెల కిశోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ నటిస్తుండగా మురళీశర్మ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక గమ్మతైన తప్పు చేసే ఓ గూఢచారి… ఓ పెద్ద కేస్‌ని ఎలా పరిష్కరించాడనే ఇతివృత్తంలో స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం వెన్నెల కిశోర్ హీరోగా తెరకెక్కించిన ఈ ‘చారి 111’ సినిమా పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Vennela Kishore Movie Updates
ఈ సందర్భంగా దర్శకుడు టీజీ కీర్తికుమార్ మాట్లాడుతూ… ‘‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ చిత్రం. ఎప్పుడూ ఏదో ఒక గమ్మతైన తప్పు చేసే ఓ గూఢచారి పెద్ద కేస్‌ని ఎలా పరిష్కరించాడనేది తెరపైనే చూడాలి. నాయకానాయికలిద్దరూ గూఢచారులుగా కనిపిస్తారు. వాళ్లకి బాస్ గా మురళీశర్మ కనిపిస్తారు. థియేటర్లకి వచ్చిన ప్రేక్షకుల్ని మా చారి కడుపుబ్బా నవ్విస్తాడు,” అని అన్నారు. నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ… ‘‘స్పై సినిమాల్లో ఓ కొత్త రకమైన ప్రయత్నం ఇది. వెన్నెల కిశోర్ నటన, టీజీ కీర్తికుమార్ దర్శకత్వం సినిమాకి హైలెట్. త్వరలోనే ట్రైలర్ ని, పాటల్ని విడుదల చేస్తామని తెలిపారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావనిరెడ్డి, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Lal Salaam Review : సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ ‘లాల్ సలామ్’ సినిమా రివ్యూ..