నిరక్ష్యం ఖరీదు నిండు జీవితం.. అంటూ ఎమోషనల్ అయిన టాలీవుడ్ డైరెక్టర్
Venky Kudumula : కొవిడ్-19 పోస్ట్ పాండమిక్ తరువాత మరణాలు ఎలా సంభవిస్తున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అకస్మాత్తుగా చనిపోతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణాలను చూసిన తరువాత కోవిడ్-19 ఎఫెక్ట్ ఏ మేర ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతోంది. కోవిడ్-19 పోస్ట్ పాండమిక్ లో సాధారణ జ్వరం కూడా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు(Venky Kudumula) ఎదురయిందట. తన ఫ్యామిలీలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిన డైరెక్టర్(Director) వెంకీ చాలా ఎమోషనల్ అయి సోషల్ మీడియాలో ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు. దీనితో వెంకీ కుడుముల పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గామారింది.
Venky Kudumula – సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేస్తే మనిషే దూరం అయ్యాడు
‘‘గత కొన్ని వారాలుగా మా కజిన్ తరచూ జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జ్వరమేనని భావించి వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్ (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం)కు దారి తీసింది. దీనితో మనిషినే కోల్పోవాల్సి వచ్చింది. సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే, అది నయం అయ్యేది. వైద్యుని దగ్గరికి వెళ్లకుండా ఆలస్యం చేయడం జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. మా కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. మన శరీరం సరైన స్థితిలో లేనప్పుడు త్వరగా జ్వరం బారిన పడతాం. అనారోగ్యానికి గురవుతాం. ఈ లక్షణాలను దయ చేసిన నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోండి. ఏదైనా సమస్యగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మనం తీసుకునే చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలే మన జీవితాల్ని కాపాడతాయి’’ అని వెంకీ కుడుముల భావోద్వేగంతో ట్వీట్ చేసారు.
‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవెంకీ కుడముల మరోసారి నితిన్ – రష్మిక కాంబోలో ఓ సినిమాను ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read : Honey Singh: విడాకులు తీసుకున్న స్టార్ సింగర్