Venkatesh : పెద్దోడు, చిన్నోడు కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కుటుంబంలోని అన్నదమ్ముల బంధం, బాంధవ్యాల నేపథ్యంగా సాగింది ఈ చిత్రం. మూవీ విడుదలై 12 సంవత్సరాలు కావస్తోంది. ప్రస్తుతం భారీగా జనాదరణ పొందిన సినిమాలన్నీ తిరిగి రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ , అంజలి, సమంత రుత్ ప్రభు కలిసి నటించిన చిత్రం మరోసారి అలరించేందుకు రానుంది.
Venkatesh Seethamman Vakitlo Sirimalle Chettu Re-release
మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె(Seethamma Vakitlo Sirimalle Chettu) చెట్టు మార్చి 7న మీ వాకిళ్లలోకి పలకరించేందుకు వస్తోంది. హాయిగా ఆనందంగా సినిమాను మరోసారి చూసేయండి. చిన్నోడు, పెద్దోడి నటనను ఆస్వాదించండి అంటూ పేర్కొన్నారు.
ఈ చిత్రం తొలిసారిగా జనవరి 11, 2013న విడుదలైంది. ఇప్పటికీ ఇందులోని పాటలు, మాటలు , సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాయి. అందుకే రీ రిలీజ్ చేయాలని భావించామంటూ పేర్కొన్నారు దర్శకుడు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరుల కథ చుట్టూ సినిమా తిరుగుతుంది.
ఇద్దరూ భిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉన్నప్పటికీ దగ్గరి బంధాన్ని పంచుకుంటారు. వారి బంధువుల నుండి ఎదుర్కొనే సూటి పోటి మాటలను ఎలా ఎదుర్కొన్నారు. ఎలా వారు గట్టెక్కారు..తమ కుటుంబం గొప్పదని చాటారని చూడాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూడాల్సిందే.
Also Read : Indrani Davuluri Movie Teaser Sensational : ‘అందెల రవమిది’ టీజర్ రిలీజ్