Venkatesh : షడ్రురుచుల సమ్మేళనంగా సక్సెస్ కు మారు పేరుగా తన ఇంటి పేరు మార్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. తను ఏ సినిమా చేసినా అది బిగ్ హిట్. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్(Venkatesh) తో తన కాంబినేషన్ కొనసాగుతూ వస్తోంది. వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేశ్ తో తీసిన ఎఫ్ -2 ఊహించని విజయాన్ని అందుకుంది. దానికి సీక్వెల్ ఎఫ్-3 తీశాడు. అది కూడా ఆశించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది.
Victory Venkatesh Hatric Movie..
తాజాగా విక్టరీ వెంకీ మామతో మరో నవ్వుల నజరానా అందించేందుకు ప్రయత్నం చేశాడు. అదే సంక్రాంతికి వస్తున్నాం పేరుతో. దీనిని ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి ) నిర్మించాడు. తను మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ తేజతో గేమ్ ఛేంజర్ తీశాడు. ఇది ఈనెల 10న విడుదలైంది. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
మరో వైపు వరుస సినిమాలతో అనిల్ రావిపూడి సూపర్ డూపర్ హిట్ మూవీగా తీర్చి దిద్దాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీని పండించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి తనదైన మార్క్ ను ఇందులో చూపించాడు. మొత్తంగా దిల్ రాజుకు ఇది బిగ్ హిట్ అని చెప్పక తప్పదు. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు దోచుకునేలా దీనిని తీశాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
వెంకటేశ్ తో పాటు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించారు.
Also Read : Hero Prabhas-Raja Saab : రాజా సాబ్ పై థమన్ కామంట్స్