Venkatesh : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మినిమం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 14న రిలీజ్ చేసింది.
Venkatesh Sankranthiki Vasthunnam OTT Postpone..
ఈ మూవీలో కీలకమైన పాత్రలలో నటించారు. విక్టరీ వెంకటేశ్(Venkatesh), మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించారు. పూర్తిగా ఫన్ లవింగ్ కథాంశంతో తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది.
ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం ఫిబ్రవరి రెండవ వారంలో ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉంది. దేశంలో పేరు పొందిన జీ మీడియా గ్రూప్ జీ5 డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ. 30 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రస్తుతం నిర్బాతలు దిల్ రాజు, శిరీష్ స్ట్రీమింగ్ సర్వీస్ తో చర్చలు కొనసాగిస్తున్నారు. కాగా రూల్స్ ప్రకారం ఓటీటీ విడుదల చేయాలంటే నాలుగు వారాల లోపు విడుదల చేయకూడదు.
Also Read : Hero Naga Chaitanya-Thandel : థండేల్ హిందీ ట్రైలర్ రిలీజ్