Venkatesh : తెలుగు సినీ పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ మెస్సేజ్ తో పాటు కడుపుబ్బా నవ్వించేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ప్రధానంగా స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh) తో తను తీసిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
ఈ మూడు వరుసగా హిట్ కావడం విశేషం. తన సినీ కెరీర్ లో ఈ చిత్రం వెరీ వెరీ స్పెషల్ అంటూ పేర్కొన్నాడు హీరో. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత దిల్ రాజు, శీరీష్ మూవీ మరింత రిచ్ గా ఉండేలా జాగ్రత్తపడ్డారు.
Venkatesh Sankranthiki Vasthunnam Updates
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సంబురాలు మిన్నంటాయి. ఇక దిల్ రాజుకు ఈ పండుగ వేళ గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఉండడం విశేషం.
ఇంటిల్లిపాది నవ్వుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బీమ్స్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. అద్భుతమైన సంగీతం అందించాడు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడిన పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమా విషయానికి వస్తే విక్టరీ వెంకటేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కీ రోల్ పోషించాడు. కామెడీని ఎక్కువగా ఇష్టపడే తను ఈ సినిమాలో కూడా మరోసారి నవ్వించేందుకు ట్రై చేశాడు.
ఇక సినిమా సక్సెస్ టాక్ అందుకోవడంతో బాక్సులు కాసులతో నిండి పోతున్నాయి. కళ కళ లాడుతున్నాయి. మొత్తంగా మూవీ మేకర్స్ తెగ సంబరపడి పోతున్నారు.
Also Read : Hero Vijay Deverakonda : రౌడీ బాయ్ తో సెల్ఫీ దిగిన క్రికెటర్