తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉన్న ఏకైక నటుడు విక్టరీ వెంకటేశ్. ఆయన ఈ మధ్య ఆధ్యాత్మికత వైపు మళ్లారు. తను, తన సినిమాలు, ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోక పోవడం, ఉన్నదాంట్లో సమయం చిక్కినప్పుడల్లా పుస్తకాలు చదవడంపై ఫోకస్ పెడతారు.
ప్రస్తుతం వెంకటేశ్ వైరల్ గా మారారు. వెంకీకి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి పెళ్లి అయి పోయింది. ఆమె స్వంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఇక రెండో అమ్మాయి పేరు హయవాహిని.
హైదరాబాద్ నగరంలో చాలా సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ వేడుకను నిర్వహించారు. సినిమా రంగానికి సంబంధించి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడం విశేషం. హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు హాజరయ్యారు.
ఈ అమ్మాయిని విజయవాడలో పేరు పొందిన ఓ డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో నిశ్చితార్థం జరిపించినట్టు సమాచారం. తాజాగా వెంకీ వయసు పెరిగినా ఎక్కడా ఆగడం లేదు. తను కూడా యువ నటులతో పోటీ పడి నటిస్తున్నారు. ఆ మధ్యన ఎఫ్ 2 లో వరుణ్ తేజ్ తో మెయిన్ రోల్ చేశాడు. ఎఫ్3 కూడా . రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా సైంధవ్ లో నటిస్తు్నాడు. ఈ చిత్రం జనవరి 13న రానుంది.