VD 14 Movie : విజయ్ దేవరకొండ మూవీ లో హాలీవుడ్ విలన్

' ది మమ్మీ రిటర్న్స్‌'లోను అద్భుతమైన పాత్రతో అదరగొట్టారు...

Hello Telugu - VD 14 Movie

VD 14 : టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). గతంలో పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లైగర్ సినిమాలో హాలీవుడ్ లెజెండ్ ‘మైక్ టైసన్’ కామియో రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా ఎంతో డిజాస్టర్ అయ్యిందో.. అంతే రేంజ్‌లో మైక్ టైసన్‌ని వేస్ట్ చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదురుకున్నారు మేకర్స్. ఇక వరుస ప్లాప్స్‌తో సతమవుతున్న విజయ్ తన కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో జత కట్టి స్ట్రాంగ్ మూవీ లైనప్‌ని ప్లాన్ చేశారు. అయితే విజయ్ మూవీలో మరోసారి ఓ పవర్ ఫుల్ హాలీవుడ్ విలన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సారి ఆ ప్రయత్నం సఫలమవుతుందో, విఫలమవుతుందో వేచి చూడాల్సి ఉంది.

VD 14 Movie Updates

టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడిగా రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో విజయ్ ‘VD 14’ తెరకెక్కనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటీకే రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ‘ది లెజెండ్‌ ఆఫ్‌ ది కర్స్డ్‌ ల్యాండ్‌’ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ది మమ్మీ’ సినిమాలో అతీంద్రియ శక్తులతో శాపగ్రస్తుడైన ప్రధాన పూజారి ఇమ్‌హోటెప్ పాత్రలో మాస్టర్ క్లాస్ యాక్టింగ్ ఆకట్టుకున్న నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. ‘ ది మమ్మీ రిటర్న్స్‌’లోను అద్భుతమైన పాత్రతో అదరగొట్టారు. ఏజెంట్ కోడి బ్యాంక్స్, బ్లడ్ డైమండ్ , సిల్వర్టన్ సీజ్ వంటి సినిమాల్లో సినిమాలోనూ అదరగొట్టిన వోస్లూ.. ప్రస్తుతం 24, NCIS, చక్, బోన్స్, ఎలిమెంటరీ, బాష్, ది బ్లాక్‌లిస్ట్, జాక్ ర్యాన్ వంటి సూపర్ డూపర్ వెబ్ సిరీస్ లో అదరగొట్టాడు. కాగా ఆయన ‘VD 14’లో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ తర్వాత ఆర్నాల్డ్‌దే కీలక పాత్రా కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2026లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Also Read : Salman Khan : సడన్ గా హైదరాబాద్ ఫలక్ నామా ప్యాలెస్ లో ల్యాండ్ అయిన సల్మాన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com