Varun Tej : హైదరాబాద్ – పాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి త్వరలో డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ పేరుతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఏకైక నటుడు డార్లింగ్ ప్రభాస్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాతో యానిమల్ మూవీ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Varun Tej Movie Updates
ప్రస్తుతం ప్రభాస్ విలక్షణ దర్శకుడిగా పేరొందిన మారుతి దర్శకత్వంలో పూర్తి యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టోరీ రాజా సాబ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరో వైపు టాలెంటెడ్ కలిగిన దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన కల్కి చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ గా కల్కి-2 తీస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్ర ప్రభాస్ దే. ఈ సినిమా షూటింగ్ 25 శాతం షూటింగ్ అయిపోయిందని టాక్.
తాజాగా స్పిరిట్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో ప్రతి నాయకుడి పాత్రను వరుణ్ తేజ్(Varun Tej) పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తను హరీశ్ శంకర్ దర్శకత్వంలో గద్దలకొండ గణేశ్ చిత్రంలో నటించాడు. తన పాత్రపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వంగా సందీప్ రెడ్డి.
Also Read : Hero Saif-Sara : సైఫ్ ఆరోగ్యంపై సారా అలీ ఖాన్ ఆరా