Varun Lavanya Marriage ఇటలీ వేదికగా ఒక్కటైన మెగా ప్రిన్స్-లావణ్య త్రిపాఠీ

ఇటలీ వేదికగా ఒక్కటైనా మెగా వారసుడు వరుణ్ తేజ్, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి

Teluguism-Varun Lavanya Marriage

ఇటలీ వేదికగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం

 

మెగా కుటుంబం ఇంట పెళ్ళి బాజాలు మ్రోగాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం ఇటలీలోని టస్కానీ వేదికగా ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తో కలిసి లావణ్య ఏడు అడుగులు నడవగా… లావణ్య మెడలో మూడు ముళ్లు వేసి తన వివాహ బంధానికి బీజం వేసారు వరుణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన అగ్రహీరోలంతా ఈ పెళ్ళి వేడుకలో పాల్గొని సందడి చేసారు. హీరో నితిన్ తన భార్య షాలినితో కలిసి వరుణ్-లావణ్యల పెళ్ళిలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఈ నెల 5న హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఎన్-కన్వెన్షన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు.

నూరేళ్ళ వివాహ బంధంగా మారిన వరుణ్-లావణ్యల ఆరేళ్ళ స్నేహ బంధం

2017లో మిస్టర్ సినిమాలో హీరో,హీరోయిన్లుగా నటించిన సమయంలో వరుణ్-లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం… ఆరేళ్ళ తరువాత అంతరిక్షం సినిమా సమయంలో ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమకు తమ కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించడంతో ఇటలీ వేదికగా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నారు. అయితే మిస్టర్ సినిమాతో ఫ్రెండ్ గా పరిచయం అయిన లావణ్య అభిరుచులు నచ్చడంతో ఆమెను ఇష్టపడ్డానని ఇదే విషయాన్ని ఆమెకు ప్రపొజ్ చేయగా ఆమె అంగీకరించిందని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో వరుణ్ తేజ్ స్ఫష్టం చేసారు. అంతేకాదు వరుణ్ తేజ్ వాడుతున్న ఫోన్ సైతం లావణ్య ఇచ్చిన గిఫ్ట్ అని బహిరంగంగానే చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com