Varun Dhawan: బీటౌన్ లో పరిచయం అక్కర్లేని పేరు వరుణ్ ధావన్. గతేడాది జాన్వీ కపూర్ తో జోడీగా వచ్చి బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైనప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం స్ట్రీ-2, బేబీ జాన్ సినిమాలతో పాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ… వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీనితో వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందా అనే దానిపై అభిమానులకు ఆశక్తి నెలకొంది. ఈ నేపథ్‌యంలో అభిమానుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు ఈ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.
Varun Dhawan….
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ఈ సినిమాలో వామికా గబ్బీ కీలక పాత్రలో నటిస్తోంది. మురద్ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతీ దేశ్ పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు అట్లీ సమర్పణలో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా మే 31న రావల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. దీనితో ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ‘బేబీ జాన్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నాడు హీరో వరుణ్ ధావన్(Varun Dhawan). తాజాగా ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ… ఓ కొత్త పోస్టర్ ని షేర్ చేసింది. చిన్న ఆయుధం పట్టుకున్న వరుణ్ ని కత్తులతో శత్రువులు చుట్టుముట్టినట్టు ఉన్న పోస్టర్‌ని చూస్తే ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టే తెలుస్తోంది. జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు.
Also Read : Kalki 2898 AD: ఒక ప్రభాస్ 1000 మంది రెబల్ స్టార్లతో సమానం – శ్యామలా దేవి