Varun Dhawan: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్… అభిమానులతో శుభవార్త షేర్ చేసుకున్నారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2021లో ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్న వరుణ్ ధావన్… దాదాపు మూడేళ్ళ తరువాత తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ కామెంట్ పెట్టారు. దీనితో సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Varun Dhawan’s Good News
బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు వరుణ్ ధావన్. గతేడాది జాన్వీ కపూర్ తో జోడీగా వచ్చి బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైనప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్(Varun Dhawan) ప్రస్తుతం మర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కూడా వరుణ్ ధావన్ కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్,డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Oppenheimer: బాఫ్టా అవార్డుల్లో సత్తా చాటిన ఓపెన్ హైమర్