Varun Dhawan: 2016లో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘తేరీ’. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలె విజయ్, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో అధికారికంగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్ పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Varun Dhawan Movie Updates
జియో స్టూడియోస్ సమర్పణలో ఏ ఫర్ యాపిల్, సినీ1 స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘బేబీ జాన్’ అనే టైటిల్ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది టీజర్ లో వరుణ్ ధావన్(Varun Dhawan) ను పవర్ ఫుల్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్ వరుణ్ ధావన్ లో చూపించి ఆకట్టుకున్నారు. దీనితో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడంతో పాటు దానికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘తేరీ’ కు రీమేక్ గా వస్తున్న ‘బేబి జాన్’ సినిమా విడుదల తేదీని ఆఫీషియల్ అనౌన్స్ చేసారు మేకర్స్. వేసవి కానుకగా ఈ సినిమాను మే 31, 2024 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో వరుణ్ ధావన్ బీస్ట్ మోడ్లో కనిపించారు. ఒంటిపై రక్తపు మరకలు, పొడవాటి జుట్టుతో ఉన్న వరుణ్ ధవన్ సీరియస్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో నిర్మాతగా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.
మరోవైపు ఇదే ‘తేరి’ మూవీని తెలుగులో కమర్షియల్ డైరెక్టర్ హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘తెరి’ లోని మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకొని పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా తనదైన స్టైల్ లో హరిష్ శంకర్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో ‘తేరీ’ రిలీజ్ అయిన తరువాత తెలుగు ‘తేరీ’ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Manchu Mohan Babu: కాబోయే దంపతులను ఆశీర్వదించిన మోహన్ బాబు !