Varisu Distributor : తమిళ సినీ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారిసుకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆపై ఏకంగా జోసెఫ్ విజయ్(Vijay) కు లేఖ రాశాడు. ప్రస్తుతం ఇది కలకలం రేపుతోంది సినీ ఇండస్ట్రీలో.
Varisu Distributor Issue Viral
కేరళకు చెందిన డిస్ట్రిబ్యూటర్ రాయ్ తనకు సినిమా పరంగా నష్టం వాటిల్లిందని వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతూ జూలై 13న లేఖ రాశాడు. వారిసు చిత్రం కేవలం రూ. 6.83 కోట్లు మాత్రమే వసూలు చేసిందని పేర్కొన్నాడు. ఆశించిన కలెక్షన్లు రాలేదని వాపోయాడు. ఇందులో తన కమీషన్ పరంగా నిర్మాత దిల్ రాజు నుండి రూ. 3 కోట్ల 60 లక్షలు రావాల్సి ఉందని తెలిపాడు.
మార్చి 13న కేవలం 16 లక్షలు మాత్రమే అందుకున్నానని, ఇంకా బకాయి పడిన రూ. 3.44 కోట్లు రావాల్సి ఉందని వాపోయాడు డిస్ట్రిబ్యూటర్ రాయ్. పలుమార్లు దిల్ రాజు నుంచి స్పందన లేదన్నారు. దీని వల్ల తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందాడు.
ఎంతకూ నిర్మాత స్పందించక పోవడంతో మీకు లేఖ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు డిస్ట్రిబ్యూటర్. హీరోలు చెబితే నిర్మాతలు వింటారని దయచేసి నాకు డబ్బులు ఇప్పించండని కోరాడు.
Also Read : Hesham Abdul Wahab : టాలీవుడ్ తెగ నచ్చేసింది – హేషమ్