Varalaxmi : తమిళ సినీ స్టార్ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మధ్య విశాల్ తో ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం జరిగింది. వాటన్నింటిని తోసి పుచ్చింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఇప్పటికే లేడి ఓరియంటెడ్ పాత్రలకు ప్రయారిటీ ఇస్తోంది. చాలా సినిమాలలో ప్రతి నాయకి పాత్రల్లో నటించి మెప్పించింది. అంతే కాదు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Varalaxmi Movie Updates
ఇచ్చిన ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేస్తోంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi) కు పెద్ద ఎత్తున నెగటివ్ రోల్స్ నటించేందుకు లెక్కలేనన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది భాషల్లో నటిస్తోంది బిజీగా మారింది. విచిత్రం ఏమిటంటే తను నటించిన ప్రతి మూవీ రికార్డ్ బ్రేక్ చేస్తూ వసూళ్ల పరంగా మెస్మరైజ్ చేస్తుండడంతో నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కథ చెప్పినట్లు సమాచారం. ఈ మూవీని పాన్ ఇండియా గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కథ అద్భుతంగా ఉండడంతో తను ఓకే చెప్పినట్లు టాక్.
ఇదిలా ఉండగా ఇటీవలే 12 ఏళ్ల కిందట విశాల్ తో అంజలితో కలిసి తెర పంచుకున్న మధ గజ రాజా మూవీ చాన్నాళ్లకు విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇది కూడా జోష్ నింపేలా చేసింది వరలక్ష్మి శరత్ కుమార్ ను. కాగా దండు, రాఘవ రెడ్డి, ఆది పర్వం సినిమాలు తీసిన డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆఫర్ కు వరలక్ష్మి ఓకే చెప్పింది.
Also Read : RGV Shocking Comments : ‘సిండికేట్’ పై ఆర్జీవీ బిజీ