Varalaxmi : నా భార్యకు నేను ఫస్ట్ లవ్ కాదని అన్నారు.. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలయ్ సచ్‌దేవ్. వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం ఇటీవల ముంబైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెన్నైలోని ఓ హోటల్‌లో వీరు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన అగ్రనటీనటులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi) భర్త నికోలయ్ సచ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నికోలయ్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. ‘‘నా భార్య పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె ఫస్ట్ లవ్ సినిమాలు, సెకండ్ లవ్ నేను. వివాహం తర్వాత తను నా దగ్గరకు వచ్చి పేరు మార్చుకుంటానని చెప్పగా, వద్దని వారించాను. ఇకపై కూడా వరలక్ష్మి శరత్ కుమార్‌గానే కొనసాగాలి. కానీ, నేను నా పేరును మాత్రం నికోలయ్ వరలక్ష్మి సచ్‌దేవ్‌గా మార్చుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అని తెలిపారు.
Varalaxmi Husband Comment
అనంతరం వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘మీ అందరి ఆదరాభిమానాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. వివాహం తర్వాత కూడా ఈ మద్దతు కొనసాగాలని కోరుతున్నాను. పెళ్ళి తర్వాత సినిమాల్లో నటిస్తావా? అంటూ చాలా మంది అడుగుతున్నారు. ఈ విషయంలో నా భర్తే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇకపై కూడా సినిమాల్లో నటిస్తాను. ఇపుడు నటించే చిత్రాలే కాకుండా కొత్త చిత్రాల్లో కూడా నటిస్తాను’’ అని స్పష్టం చేశారు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఒక పత్రికా విలేకరిగా ఉన్న నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం మీడియానే. అందుకే మీ అందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇకపై కూడా మీ ఆదరాభిమానాలు, మద్దతు కొనసాగాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌ను వరలక్ష్మి ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
Also Read : Double Ismart : డబుల్ ఇస్మార్ట్ సినిమా పాటలో మాజీ సీఎం కేసీఆర్ స్వరం