అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ గా మారిన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాంబు పేల్చారు. తన తదుపరి ప్రాజెక్టు ప్రిన్స్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు కథ కూడా చెప్పానని మహేష్ బాబు అందుకు ఓకే చెప్పారని పేర్కొన్నాడు.
ఇది పూర్తిగా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉంటుందని, పూర్తిగా నెగటివ్ షేడ్ లో పాత్ర కనిపించనుందని వెల్లడించాడు దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. ప్రస్తుతం హిందీలో సినిమా చేస్తున్నాడు. అందులో రష్మిక మందాన్న హీరోయిన్. రణ్ బీర్ కపూర్ హీరో.
హిందీలో ఇప్పటికే అర్జున్ రెడ్డిని తీశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా వంగా సందీప్ రెడ్డి మహేష్ బాబు తో తీస్తానని చెప్పడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. టేకింగ్ లోనే కాదు మేకింగ్ లో సైతం తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న వంగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత జక్కన్న మూవీతో నటించనున్నాడు. అనంతరం వంగా సందీప్ తో స్టోరీ లాక్ చేసినట్టు టాక్.