Vaishnavi Chaitanya : ఒకప్పుడు బూతు అనేది నాలుగు గోడల వరకే పరిమితం అయి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ముద్దులు, హగ్ లు, శృంగార సన్నివేశాలు పెద్ద ఎత్తున తెర మీద ప్రత్యక్షం అవుతున్నాయి. ఇక ఎలాంటి సెన్సార్ షిప్ లేక పోవడంతో ఓటీటీలలో సెక్స్ రాజ్యం ఏలుతోంది. ఇదేమిటని పైకి అంటున్నా ఎవరూ వాటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ఇక వల్గర్ లాంగ్వేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్ ను కమ్మేసింది. హీరో, హీరోయిన్లు అలవోకగా మాట్లాడేస్తున్నారు. తాము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. అందుకే తమ తప్పు ఇందులో ఏముందంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు దర్శక, నిర్మాతలు.
Vaishnavi Chaitanya Sensational Comments
ఇక తెలుగు సినిమా పాటల విషయానికి వస్తే అత్యంత దారునంగా ఉన్నాయి. జనసేన పార్టీలో సభ్యుడిగా ఉంటూ , పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా ఉన్న కొరియోగ్రాఫర్ చేసిన పాటలు ఈ మధ్యన ట్రోల్ కు గురయ్యాయి. బాలయ్య, ఊర్వశి రౌటేలా సాంగ్ , రాబిన్ హుడ్ లో కేతకి శర్మ చేసిన స్పెషల్ సాంగ్ చిత్రీకరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మరి సెన్సార్ మెంబర్స్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో మంచి సినిమాలు, కథలకు పేరు పొందాడు బొమ్మరిల్లు భాస్కర్. కానీ తను తాజాగా సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)తో తీసిన చిత్రం జాక్.
ఇందులో మోతాదుకు మించి బూతు మాటలతో హోరెత్తించాడు. హీరో ముద్దు ఇవ్వమంటూ హీరోయిన్ ను వెంట పడతాడు. ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పదల్చుకున్నాడో డైరెక్టర్ కే తెలియాలి. ఇదే విషయంపై హీరో సిద్దు సమాధానం ఇస్తూ ..కథ పరంగా బూతులు మాట్లాడాల్సి వచ్చిందన్నాడు. సినిమా ప్రమోషన్ సందర్బంగా నటి వైష్ణవి చైతన్య నోరు పారేసుకుంది. ఉఫ్ ఎఫ్ అంటూ పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. బూతు సినిమా చేస్తే సరిపోతుందంటూ పేర్కొంటున్నారు.
Also Read : Hero Allu Arjun :అల్లు అర్జున్ కు శుభాకాంక్షల వెల్లువ