Vaishnavi Chaitanya: ఒక్క సినిమా హిట్ రాగానే చకచకా పది సినిమాలకు సైన్ చేసేస్తుంటారు నేటి హీరోయిన్లు. నిర్మాతలు, దర్శకులు సైతం హిట్ హీరోయిన్లను తమ సినిమాల్లో తీసుకోవడానికి క్యూ కడుతూ ఉంటారు. కాని ’బేబీ‘ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత కూడా ఆచీతూచీ అడుగులు వేస్తుంది నటి వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో వైష్ణవి నటనకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఫిదా అయి… సహజ నటిగా ఆమెను ప్రశంసించారు. దీనితో వైష్ణవి తరువాత చేయబోయే సినిమాపై అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో ఆమె ఎట్టకేలకు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రోడక్షన్ లో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.
Vaishnavi Chaitanya Movie Updates
దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడానికి బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. యువతరం మెచ్చే చక్కని ప్రేమకథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా… జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నట్లు సమాచారం.
Also Read : Hansika Motwani: ఓటీటీలోకి వచ్చేసిన హాన్సిక క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!