మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కొనసాగుతోందని పేర్కొంది. ఇందులో కీలక పాత్రల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అందాల ముద్దుగుమ్మ శ్రీలీల నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక దర్శకుడు , పవన్ కలిసి గబ్బర్ సింగ్ గతంలో తీశారు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తీస్తున్న ఈ చిత్రంపై పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ దీనిని తీస్తుండడం విశేషం.
స్వతహాగా రచయిత కావడంతో డైలాగులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. తను రాసిన నాకో తిక్కుంది దానికో లెక్కుంది అన్న మాటలు సినీ రంగాన్ని ఊపేశాయి. ఇక పవర్ ఫుల్ పంచ్ లు, ప్రాసలతో హోరెత్తించే దమ్ము డైరెక్టర్ కు ఉంది.
అంతే కాదు పవన్ కళ్యాణ్ మేనరిజానికి తగ్గట్టు ఉస్తాద్ భగత్ సింగ్ ఉండబోతోందని చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాకు శ్రీలీల అందం అదనపు అస్సెట్ కావడం ఖాయం.