Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్లు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా…. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు అట్లీ, హీరో విజయ్ కాంబినేషన్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘తేరీ’ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్… ఒకవైపు సినిమా చేస్తూనే రాజకీయాలు చేస్తుండటంతో షూటింగ్ లో కాస్తా గ్యాప్ వచ్చింది. శనివారం (మార్చి 16) సార్వత్రిక ఎన్నికల నగరా మ్రోగడంతో… పోలింగ్, ఫలితాలు వచ్చేవరకు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీలో కలిసి ఎన్నికలకు వెళ్తున్న జనసేనాని… ప్రచారం నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Ustaad Bhagat Singh Updates
ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాలు, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయి ఉన్న పవన్ కళ్యాణ్ కు దర్శకుడు హరీష్ శంకర్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసారనే ప్రచారం జరుగుతోంది. సమకాలీల సమస్యలు, రాజకీయాలపై తనదైన పంచ్ డైలాగ్ లతో గుర్తింపు పొందిన దర్శకుడు హరీష్ శంకర్… ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’ లో కూడా మంచి డైలాగ్ లు రాసారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉందని… ఆ డైలాగ్ తో కూడిన ఒక స్పెషల్ టీజర్ ని మూవీ టీమ్ త్వరలో రిలీజ్ చేయనుందనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.
గతంలో మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్ రాసిన డైలాగ్ ను చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆ డైలాగ్ కు మెగాస్టార్ నుండి దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసలు అందుకున్నారు. అటువంటి పవర్ ఫుల్ డైలాగ్ తో ఒక స్పెషల్ టీజర్ ను హరీష్ శంకర్ తయారుచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ఆ టీజర్ కోసం అటు పవన్, జనసేన అభిమానులు కార్యకర్తలతో పాటు పొత్తులో ఉన్న బీజేపీ, టీడీపీ అభిమానులు కూడా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Mahesh Babu: అభిమానుల కోసం మహేశ్ బాబు స్పెషల్ ఫోటో షూట్ ?