Ustaad Bhagat Singh : దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి సక్సెస్ కాంబినేషన్ కంటిన్యూ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అందాల ముద్దుగుమ్మ శ్రీలీలతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ కథ అందించాడు.
Ustaad Bhagat Singh Updates
2016లో వచ్చిన తేరి ఆధారంగా ఉస్తాన్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) ను తెర కెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు . నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ తో శ్రీలీల తొలిసారిగా నటిస్తుండడం విశేషం. ఆమెతో పాటు సాక్షి వైద్యను కూడా ఎంపిక చేశారు హరీష్ శంకర్.
అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. యాక్షన్, డ్రామా చిత్రంగా ఉండనుంది.
అశు తోష్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాష్ , గౌతమి, చమ్మక్ చంద్ర ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ చిత్రం తేరికి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రానుంది. దీనిని తమిళంలో క్రియేటివ్, డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ తీశాడు. వచ్చే ఏడాది 2024లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. సినిమా షూటింగ్ కోసం ఆయుధాలను కూడా సిద్దం చేశాడు.
Also Read : Shiva Nirvana : ఖుషీ సక్సెస్ ఊహించిందే – శివ నిర్వాణ