Urvashi Rautela : బాబీ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ బిగ్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన ఈ సినిమా మిగతా మూవీస్ కు ధీటుగా కలెక్షన్ల పరంగా పరుగులు పెడుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప్రధానంగా ఈ సినిమాకు వీర లెవల్లో మ్యూజిక్ అందించాడు ఎస్ఎస్ థమన్. తను అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్ అందించేలా చేసింది.
Urvashi Rautela Comment
నందమూరి బాలకృష్ణ మేనరిజం మరోసారి సినిమాకు హైలెట్ గా నిలిచింది. మరో వైపు ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య నటించడం విశేషం. ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) తో కలిసి చేసిన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా సినిమా బిగ్ సక్సెస్ కావడంతో తెగ సంతోషానికి లోనవుతోంది ఈ ముద్దుగుమ్మ.
మీడియాతో మాట్లాడిన ఊర్వశి రౌటేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన డాకు మహారాజ్ తో పాటు మరో సినిమా గేమ్ ఛేంజర్ కూడా విడుదలైందని, కానీ తమ మూవీకే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చిందంటూ బాంబు పేల్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ సినిమా గురించి చెప్పుకో కానీ ఇతర సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఊర్వశీనా మజాకా అంటున్నారు ఆమె అభిమానులు.
Also Read : Comic Genius Brahmanandam : ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్