Urfi Javed : నిత్యం వార్తల్లో ఉండడం ఉర్ఫీ జావెద్ కు అలవాటు. సోషల్ మీడియాలో ప్రస్తుతం తను ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి కారణం తనకు ప్రియుడు ఉంగరం తొడిగాడంటూ మనసులో మాట చెప్పేసింది. ఆపై ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఇవి వైరల్ గా మారాయి. నెటిజన్లు కొందరు ఇదంతా కావాలని ప్రచారం కోసం ఆడుతున్న డ్రామా అంటూ కొట్టి పారేశారు. మరికొందరు మాత్రం అలాంటిది ఏమీ లేదు. తను పెళ్లి చేసుకో బోతోందంటూ తెలిపారు.
Urfi Javed Engagement Viral
ఇదంతా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఉర్ఫీ జావెద్(Urfi Javed) ఆడుతున్న నాటకం అంటూ కొట్టి పారేశారు. అయితే ఎవరూ కూడా ఎంగ్జైట్ కావద్దని నిజంగానే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ పేర్కొంది ఉర్ఫీ జావెద్.
కాగా తనకు సంబంధించిన ఏ అంశమైనా సరే వెంటనే తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటుంది. తాను నిశ్చితార్థం చేసుకున్నది వాస్తవమేనంటూ పేర్కొంది. ఇందులో అనుమానం చెందాల్సిన పని లేదంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్యన టాప్ లెస్ తో దర్శనం ఇచ్చింది. ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చేలా చేసింది. ఏది ఏమైనా ఉర్ఫీ జావెద్ కు రావాల్సిన దానికంటే పబ్లిసిటీ వచ్చిందనేది మాత్రం నిజం. ఇది కూడా ఓ సక్సెస్ కదూ.
Also Read : Hero Balayya-Daaku maharaaj :డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్