Upasana Konidela: డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ వంటి నవరసాలతో హీరోగానే కాదు… వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్ గా శిరాగ్రాన నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలతో పాటు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ల ఏర్పాటుతో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం… దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషన్ ను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును… భారత రాష్ట్రపతి చేతుల మీదుగా త్వరలో మెగాస్టార్ కు అందజేయనున్నారు. అయితే దేశంలో రెండో అత్యున్నత పురస్కారంకు చిరంజీవిని వరించడం పట్ల… సినీ, రాజకీయ ప్రముఖులంతా మెగాస్టార్ కు వివిధ రకాలుగా అభినందనలు తెలుపుతున్నారు.
Upasana Konidela Special Treat
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన… చిరంజీవి(Chiranjeevi) కోసం ప్రత్యేకంగా తన నివాసంలో అభినందన సభను నిర్వహించి గ్రాండ్ పార్టీను ఏర్పాటు చేసింది. ఉపాసన ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ పార్టీకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మెగాస్టార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉపాసన ఇచ్చిన పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఎన్ని విధాలుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపినా… ఉపాసన ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీ మెగా ఫ్యామిలీను సంబరాల్లో ముంచెత్తుతోంది. ఉపాసన ఏర్పాటు చేసిన ఈ పార్టీకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా హాజరుకావడంతో పాటు… తెలంగాణా ప్రభుత్వం తరపున చిరంజీవికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ సందర్భంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం మన అందరికీ చాలా గర్వకారణం. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. దీనితో మెగా కోడలు ఉపాసన హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతూ… పార్టీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
Also Read : Yatra 2 Trailer : వైరల్ అవుతున్న యాత్ర 2 ట్రైలర్