Twinkle Khanna : బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త , ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో మరిచి పోలేని ఘటన ఏదైనా ఉందంటే అక్షయ్ ను భర్తగా పొందటమేనని పేర్కొన్నారు.
Twinkle Khanna Praises her Husband Akshay Kumar
అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ ప్రముఖ నటీనటులుగా పేరు పొందారు. ప్రస్తుతం ఇంటికే పరిమితమైనా అక్షయ్ తో ఎంజాయ్ చేస్తోంది ట్వింకిల్ కన్నా(Twinkle Khanna).
అక్షయ్ కుమార్ కు 56 ఏళ్లు నిండాయి ఈ ఏడాదితో. తోటి నటీనటులతో పాటు సినీ వర్గాలు సైతం బర్త్ డే విషెస్ తో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. హోమర్ ను ప్రేమిస్తున్న దాని కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని తెలిపారు ట్వింకిల్ ఖన్నా.
అమెరికన్ సిట్ కామ్ షో ది సింప్సన్స్ లో మార్జ్ , హోమర్ అత్యంత ప్రసిద్ద జంటలలో ఒకరు. ఇదిలా ఉండగా ఉజ్జయినిలోని మహా కాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు దంపతులు. వీరి వెంట ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉండడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన వెల్ కమ్ టు ది జంగిల్ పేరుతో అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన చిత్రం రానుంది.
Also Read : Shah Rukh Khan : జవాన్ జోష్ బాద్ షా ఖుష్