Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రిన్స్ మహేష్ బాబు, లవ్లీ బ్యూటీ శ్రీలీలతో తీసిన గుంటూరు కారం ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. అయినా ఎక్కడా తన మార్కెట్ కోల్పోలేదు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్, బ్రాండ్ కలిగి ఉన్నాడు త్రివిక్రమ్(Trivikram). తను ఏది తీసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. అలా ఉండేలా జాగ్రత్త పడతాడు.
Trivikram-Bunny Movie Updates
కథలు రాయడం, పుస్తకాలు చదవడం, మాటల్ని పొదుపుగా, ఆకట్టుకునేలా , మనసు దోచుకునేలా ఇంటిల్లిపాదిని అలరించేలా , గుండెల్ని హత్తు కునేలా రాయడంలో తనకు తనే సాటి. సాహిత్యానికి, పాటలకు, సంగీతానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జయాప జయాలతో పని లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు.
తను పవన్ కళ్యాణ్ తో తీసిన అత్తారింటికి దారేది మూవీని ఇప్పటికీ జనం చూస్తున్నారు. ఇక బన్నీతో తీసిన అల వైకుంఠ పురంలో గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తో గతంలో జులాయ్ తీశాడు. ఇందులోని డైలాగులు ఇప్పటికీ వెంటాడుతాయి. తాజాగా మనోడితో మూవీ తీస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కథ చెప్పాడని, అల్లు అర్జున్ ఓకే చేశాడని కూడా టాక్. దీనికి పేరు కూడా ఖరారు చేసినట్లు..అది గాడ్ ఆఫ్ వార్ పేరుతో తెరకెక్కించేందుకు సిద్దం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Hero Bunny-Pushpa 2 OTT :ఓటీటీలోనూ పుష్ప2 తగ్గేదే లే