టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక హీరో అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుందోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు బన్నీతో మాటల మాంత్రికుడు అల వైకుంఠపురంలో సినిమా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మ్యూజిక్ పరంగా దేశ వ్యాప్తంగా ఒక ఊపింది. ఇందుకు సంబంధించి ఎస్ఎస్ థమన్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
ఇక అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటన, బన్నీ మాస్ అప్పియరెన్స్ , త్రివిక్రమ్ డైలాగులు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లో నిలిచేలా చేశాయి. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని రారాజుగా ఏలుతున్నాడు అనిరుధ్ రవిచందర్.
అతడితో గతంలో పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమా తీశాడు. తాజాగా విశ్వసనీయ సమచారం మేరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్, అనిరుధ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని టాక్. మరి నిజమైతే బాగుంటుందని అనుకుంటున్నారు బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్.