Trisha Krishnan : అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు పెట్టినపుడు త్రిషను తీసుకొచ్చారని, ఆమెకు రూ25 లక్షలు పరిహారంగా చెల్లించారని చెప్పారు. డ్యాన్స్ పార్టీకి, డిన్నర్‌కి త్రిషని తీసుకెళ్లారని చెప్పింది.కవతూర్ రిసార్ట్‌లో త్రిషతో సెలబ్రిటీలు డ్యాన్స్ పార్టీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కామెంట్ పై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. త్రిష ఇప్పటికే ట్విట్టర్ వేదికగా రాజు పరువు తీసింది. అటెన్సన్ కోసం దిగజారి మాట్లాడే వాళ్ళను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అన్నారు. వారికి లీగల్ నోటీసు కూడా పంపారు.
Trisha Krishnan Comments Viral
ఏవి రాజు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని త్రిష ప్రకటించింది. నటుడు మన్సూర్ అలీఖాన్‌పై వివాదం చల్లారకముందే పొలిటిసీయన్ త్రిషపై(Trisha Krishnan) అనుచిత వ్యాఖ్యలు చేయడం తమిళనాడులో గందరగోళంగా మారింది. ఇక నుంచి వారిని ఉపేక్షించేది లేదని ఇండస్ట్రీ పెద్దలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని. త్రిషకు మద్దతుగా నిలిచారు.
త్రిషపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు స్పందించారు. వీరిలో దర్శకులు చేరన్, సముద్రఖని, నాజర్ లు త్రిషపై రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆరోపణలను గట్టిగా తోసిపుచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలకు త్రిష కృతజ్ఞతలు తెలిపింది. త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషను గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల శిబిరానికి తీసుకెళ్లారని ఆయన ఎత్తిచూపారు. దీనికి గాను త్రిషకు 25 లక్షలు పరిహారంగా అందాయని కూడా చెప్పారు. త్రిషను కేవలం డ్యాన్స్ పార్టీ మరియు డిన్నర్ కోసం అక్కడికి తీసుకొచ్చారని రాజు చెప్పారు. కవతూర్ రిసార్ట్‌లో త్రిషతో కలిసి ప్రముఖులు డాన్స్ పార్టీ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
Also Read : Kumar Shahani: బాలీవుడ్ లో విషాదం ! వెటరన్ డైరెక్టర్ కుమార్ సహానీ మృతి !