Trisha Krishnan: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వం వహించారు. నయనతార, ఆర్జే బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్, తిరునవక్కరసు, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. 2020లో తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’గా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను… తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తాజాగా ఈ ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్ గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
Trisha Krishnan…
అయితే ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్‌జే శరవణన్‌తో కలిసి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్‌లో నయనతార కాకుండా త్రిష(Trisha Krishnan) నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి… ఈ సీక్వెల్ లో త్రిష నటిస్తారా? లేదా నయనతార కొనసాగుతారా అంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read : Malaika-Arjun Kapoor : తమ బంధానికి వీడ్కోలు పలికిన మలైకా అరోరా, అర్జున్ కపూర్