సినీ, క్రీడా, రాజకీయ రంగాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో ఎవరూ చెప్పలేరు. ప్రత్యేకించి సినీ సెక్టార్ లో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదు. ఒక్కసారి గనుక ఏదైనా సినిమా బిగ్ హిట్ అయితే ఇక ఆ నటి పంట పండినట్లే. మరి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి తమిళ సినీ రంగానికి చెందిన త్రిష కృష్ణన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఓ వైపు ముద్దుగుమ్మ నయన తార 40 ఏళ్లు వచ్చినా , ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఇంకా టాప్ లో కొనసాగుతోంది. ఆమెకు పోటీగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతోంది త్రిష కృష్ణన్. ప్రధాన కారణం క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం. తను తీసిన పొన్నియన్ సెల్వన్ లో అద్భుతంగా నటించింది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో తన వైపు తిప్పుకునేలా చేసింది.
త్రిష ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. అయినా ఎక్కడా అందంలో తగ్గడం లేదు. లోకేష్ కనగరాజ్ తీసిన లియో మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. విజయ్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. డివైడ్ టాక్ వచ్చినా వసూళ్లలో సునామీ సృష్టిస్తోంది. ఇక త్రిష ఏడాది ఆదాయం రూ. 80 కోట్లకు పైగానే ఉంటోందని టాక్.
ఇక లియో చిత్రం సక్సెస్ తో త్రిష మరికొన్ని మూవీస్ , వివిధ కంపెనీలకు ఎండార్స్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.